శేరిలింగంపల్లి, డిసెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): నేషనల్ హెరాల్డ్ కేసులో రాజకీయ కక్ష సాధింపుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై చర్యలు చేపట్టారని నిరసిస్తూ శంషాబాద్ బస్టాండ్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ, డిసిసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మిరియాల ప్రీతం పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీ నాయకులు, లేబర్ సెల్ నాయకులు, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు, యువ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, సేవాదళ్, బీసీ దళ్ నాయకులు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.






