మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో బుధవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు శ్రీనివాస్ గౌడ్, చిన్నమధుసూదన్ రెడ్డి, కేవీ రావు, భిక్షపతి ముదిరాజ్, లక్ష్మారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.

దర్శకుడు బోయపాటి శ్రీను పూజలు…
అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.






