శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి విశ్వకర్మ స్వర్ణకారుల సంఘం బీసీ ఆర్గనైజర్ సెక్రెటరీ శ్రీపురం హరికృష్ణ చారి ఆధ్వర్యంలో సాయి ఈశ్వర చారి చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ నివాళులర్పించారు. శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న జయశంకర్ ప్రాంగణ విగ్రహం వద్ద ఈశ్వర చారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీలందరూ ఏకం కావాలని, ఐకమత్యంతో అందరూ సర్పంచ్ నుండి ప్రధానమంత్రి వరకు గ్రామం నుండి ఢిల్లీ వరకు బీసీలు తమ ఓట్లు తాము వేసుకొని రాజ్యాధికారం దిశగా పోరాడాలని అన్నారు. ఇకముందు ఎవ్వరు కూడా ప్రాణాలు అర్పించరాదని కోరారు. బ్రతికి ఉండి పోరాటం చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపి చారి, రాజేష్ చారి, రవీంద్ర చారి, నరేష్ చారి, భాను ప్రకాష్ చారి, సందీప్ చారి, పాండు చారి, కృష్ణ గౌడ్, పద్మశాలి సంఘం అశోక్, నాయి బ్రాహ్మణ సంఘం సాయిలు, రజక సంఘం శీను, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






