నేతాజీన‌గ‌ర్ కాల‌నీలో డ్రై డేపై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నేతాజీ నగర్ కాలనీలో శుక్ర‌వారం డ్రై డే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. కాల‌నీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్, జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ సీనియర్ ఎంటమాలజిస్టు వెంకటేశ్వర్లు, వార్డు ఇన్చార్జి విశ్వప్రసాద్, సిబ్బంది Sfw నాగేష్, fw నారప్ప ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు కాల‌నీవాసుల‌కు దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. దోమల వ‌ల్ల‌ మలేరియా, డెంగ్యూ, ఇతర విషజ్వరాలు వ‌స్తాయ‌ని, వాటిని రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ దోమల బారిన పడకుండా అవగాహన కలిగి ఉండి వారానికి ఒకసారి ఫ్రైడే డ్రై డేను పాటించాలని సూచించారు. ఈ సంద‌ర్బంగా ర్యాలీ నిర్వహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here