నమస్తే శేరిలింగంపల్లి: మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆరంబ్ టౌన్ షిప్ వాసులు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచనల మేరకు ఆరంబ్ టౌన్ షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆరంబ్ టౌన్ షిప్ లో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుదాం కాలుష్యాన్ని అరికడదాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రవీంద్ర రాథోడ్, జనార్ధన్, రాంభూపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గణేష్ కుమార్, రాజశేఖర్, అరుణ శ్రీ, రెహానా బేగం, మమతా, సుజాత, మౌనిక, కనకదుర్గ, విజయలక్ష్మి, వర్షిని తదితరులు పాల్గొన్నారు.