ప్రతి వారం అన్నదానంతో ఆకలి తీర్చుతున్న అట్టేపల్లి రామప్రభు.. 5వ వారపు కార్యక్రమం ఘన విజయం..

శేరిలింగంప‌ల్లి, మే 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి పరిధిలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ వారపు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రికా ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రికా ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం అత్యంత గొప్ప సేవ అని అన్నారు. అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి వారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలు అవసరమైన వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో పురుషోత్తం, కిరణ్, దయాకర్, తేజ, కరుణాకర్, పాండు, జి. కిరణ్‌తో పాటు శ్రీరాములు కాలనీ సభ్యులు, ఏఆర్పీ (ARP) టీమ్ సభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు, పలువురు సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here