బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శెట్టి వంశీ మోహన్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, మే 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శెట్టి వంశీ మోహన్ యాదవ్ నియమితులైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ అభినందనలు తెలిపారు. బీసీ కులాల అభ్యున్నతి కోసం అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాలను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆశీస్సులతో, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. అరుణ్ కుమార్ నాయకత్వంలో హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శెట్టి వంశీ మోహన్ యాదవ్‌ను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. అనంతరం బేరి రామచంద్ర యాదవ్ ఆయనను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ కులాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాడాల్సిన బాధ్యత శెట్టి వంశీ మోహన్ యాదవ్‌పై ఉందన్నారు. బీసీ కులాల ఐక్యత కోసం కృషి చేయడంతోపాటు యువత బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమబాటలో నడవాలని సూచించారు. ఆర్. కృష్ణయ్యను ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని కోరారు.

బుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీసీ ఉద్యమ నేతలు నారగోని గౌడ్, యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, కార్యదర్శి మేకల లలిత యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శ్రీశైలం యాదవ్, నాయి బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయిని, బీసీ సంఘాల టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, వెంకటేష్ ముదిరాజ్, మల్లేష్ యాదవ్, లాల్ కృష్ణ పరిగి, కిషోర్, కిరణ్, కృష్ణ, సిరిపురం హరికృష్ణ చారి, అశోక్, రఫిక్, రాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here