శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): హాస్పిటల్‌లో అత్యవసర స్థితిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారికి ఆయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేషన్ (ASYF) అండగా నిలిచింది. చిన్నారికి గుండె శస్త్ర చికిత్సను నిర్వహించనున్న నేపథ్యంలో రక్తం అవసరం ఉందని తెలుసుకున్న ASYF వ్యవస్థాపకుడు జి.రోహిత్ ముదిరాజ్ ఫౌండేషన్ ఈసీ మెంబర్ కిరణ్ ను పంపి చిన్నారికి రక్తం అందించారు. కిరణ్ ఈ మేరకు చిన్నారికి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటుందని, ఎప్పుడు ఎవరికి ఏ సహాయం అవసరం అయినా సరే రోజుకు 24 గంటలూ తాము అందుబాటులో ఉండి సహాయం అందిస్తామని తెలిపారు.







