చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సబ్‌స్టేషన్ 11కేవీ హుడా కాలనీ ఫీడర్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న నేపథ్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు హుడా కాలనీ చర్చి రోడ్డు, జేకబ్ బేకరీ, హుడా కేఫ్, హుడా సెంటర్ లలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంజినీర్ ఎన్‌క్లేవ్ ఫీడర్ పరిధిలోని సుభాష్ నగర్ కాలనీ, గంగారం, ఇంజినీర్ ఎన్‌క్లేవ్‌లలో కరెంటు ఉండదని తెలిపారు.





