నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర జన జాగరణ అభియాన్ లో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మంగళవారం నగరంలో పర్యటించారు. ఈ క్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, కొండాపూర్ డివిజన్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి రఘుయాదవ్, ప్రముఖ న్యాయవాది రాఘవేంద్ర రావు, ప్రముఖ వ్యాపారి ఆంజనేయులు తదితరులు సునీల్ అంబేకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా కొనసాగుతున్న శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర నిధి సమర్పణ పై ఆయన పలు సూచనలు సలహాలు అందజేశారు.






