శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీల గార్డెన్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణం పనులను జిహెచ్ఎంసి అధికారులు, కాలనీ వాసులతో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీల గార్డెన్ కాలనీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులు, కాలనీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగినదని, శ్రీల గార్డెన్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, సీసీరోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు.
నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయ శక్తులా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు స్వచ్చమైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజల కు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, స్థానిక నాయకులు సంతోష్, నరేష్ నాయక్, కాలనీ వాసులు ఫణి కుమార్, చేతన్ కుమార్, గోపాల్, జశ్వంత్, నాగేశ్వరావు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.