శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చెరువులు, కుంటల వద్ద బతుకమ్మ నిమజ్జనాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువులు, కుంటల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఆయా ప్రదేశాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచామని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లను చేయలేదని ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.






