శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): అమెరికాలో అక్టోబర్ 24వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో (UCSD)లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ని భారాస రాష్ట్ర నాయకుడు సిద్దనబోయిన పురుషోత్తమ్ యాదవ్, ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, తాల్ హాస్పిటల్స్ సీఈఓ సాయి గుండవెల్లి స్వయంగా కలిసి ఆహ్వానం అందించారు.






