ఏఆర్ సిబ్బంది పనితీరు భేష్: సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

  • ముగిసిన యాన్యువల్ డీ-మొబిలైజేషన్ పరేడ్ – 2021
  • 1635 మంది సాయుధ దళాల సమీకరణ

సైబ‌రాబాద్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గురువారం సైబరాబాద్ ఆర్మ్ డ్ రిజర్వ్(సాయుధ పోలీస్ దళాలు) యాన్యువల్ డీ మొబిలైజేషన్ పరేడ్ – 2021 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ సాయుధ దళాల గౌరవ వందనాన్నిస్వీకరించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ సైబరాబాద్ లో 2వ సారి డీ మొబిలైజేషన్ పరేడ్ జరపడం సంతోషమన్నారు.

సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీక‌రిస్తున్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

15 రోజుల పాటు పాటు జరిగిన యాన్యువల్ మొబిలైజేషన్ పరేడ్ గురువారం డీ మొబిలైజేషన్ పరేడ్ తో ముగిసిందన్నారు. మొబిలైజేషన్ పరేడ్ కు సహకరించిన రాణీ రుద్రమ అకాడమీ, యోగా నేర్పించడానికి ఏఆర్ఎస్ఐ అంజి రెడ్డి, మెడికల్ టీమ్ మెడికవర్, సీటీసీ డాక్టర్లు సుకుమార్, సరిత, క్లాసెస్ చెప్పిన డాక్టర్ డాక్టర్ శ్రీలత, కమ్యూనికేషన్ స్టాఫ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారంటే అందులో ఏఆర్ సిబ్బంది పాత్ర కూడా ఉందని చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. ఏఆర్ సిబ్బంది పనితీరు శ్లాఘనీయమన్నారు.

బాంబ్ డిస్పోజ‌ల్ ప‌నితీరును ప‌రిశీలిస్తున్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ అన్నారు. మనకు అన్నీ తెలుసు అనుకోకుండా పోలీసులు ప్రతిరోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ అప్డేట్ అవ్వాలన్నారు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ కావలన్నారు. నేర్చుకున్న విషయాలను వృత్తిపరంగా ఉపయోగించుకోవాలన్నారు. ఏఆర్ సిబ్బంది ఒక్క ఏఆర్ డ్యూటీనే కాకుండా ఎస్ఓటీ, షీ టీమ్స్, ఐటీ సెల్, స్పెషల్ బ్రాంచ్/ఎస్బీ, సైబర్ క్రైమ్స్, ప్రిజనర్ ఎస్కార్ట్స్, క్యాష్ ఎస్కార్ట్స్, గార్డ్ డ్యూటీస్, ఎంటీ డ్రైవర్స్, స్పెషల్ పార్టీ, పీఎస్ఓ డ్యూటీ, బీడీ టీం, డాగ్ స్క్వాడ్ డ్యూటీస్, పైలట్ అండ్ ఎస్కార్ట్, ట్రాఫిక్ వింగ్, కమ్యూనికేషన్స్, ఎస్పీసీ, కళాబృందం, సిసిఆర్బి, క్లూస్ టీమ్స్ తదితర విభాగాల్లో పనిచేస్తారన్నారు. ప్రతీ ఒక్క విభాగంలో ఏఆర్ పాత్ర ఉందన్నారు.

గణేష్ బందోబస్త్, పండుగలప్పుడు, నూతన సంవత్సర వేడుకల రోజు, అసెంబ్లీ ఎలక్షన్స్, ఎలక్షన్స్, వరదలు, ముఖ్యంగా కోవిడ్ – 19 వరదల సమయాల్లో ఏఆర్ సిబ్బంది చాలా బాగా పని చేశారన్నారు. కోవిడ్ సమయంలో ఏఆర్ సిబ్బంది బాగా పని చేశారు. అనేక మారుమూల ప్రాంతాల వారికి ఆహారం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారన్నారు. ఏఆర్ సిబ్బంది సాయంతో అవసరార్థులకు రక్తం, ప్లాస్మాను అందజేశామన్నారు. ఏఆర్ సిబ్బందిని సమీకరించిన ఏడీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మాణిక్ రాజ్ ను అభినందించారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. ఏఆర్ సిబ్బంది ఫిట్నెస్ ను కాపాడుకోవాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా కోసం కేటాయించుకోవాలన్నారు. వీలున్నప్పుడు కుటుంభ సభ్యులతో సమయాన్ని గడపాలన్నారు.

అనంతరం డిసిపి ట్రాఫిక్ ఎస్ ఎస్ఎమ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది క్రమశిక్షణ‌తో ట్రైనింగ్ లో పాల్గొని కొత్త విషయాలను నేర్చుకున్నారన్నారు. ఏఆర్ సిబ్బంది ట్రాఫిక్, ఐటి సెల్, సిసిఎస్, అడ్మినిస్ట్రేషన్, ఈఓడబ్ల్యూ పలు విభాగాల్లో బాగా పని చేస్తున్నారన్నారు. క్రమశిక్షణ‌తో పనిచేస్తూ ఆ రంగాలకు మంచి పేరు తెస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమానంగా పని చేస్తున్నారన్నారు. ప్రతీరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను వార్తా ప్రసార మాధ్యమాల ద్వారా గమనించాలన్నారు. ముఖ్యంగా పోలీసులు ప్రజలతో ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలి. పోలీసులు ప్రతేరోజు వారి నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాలి. క్రౌడ్ కంట్రోల్, మాబ్ డిస్పోజల్ బందోబస్తు వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. పోలీస్ సిబ్బంది బాగా పని చేసి తెలంగాణ పోలీసులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

అనంతరం ఏడీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మాణిక్ రాజ్ మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు, వారిని కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సమాయత్తం చేసేందుకు యాన్యువల్ మొబిలైజేషన్ పరేడ్ 2021 దోహదపడిందన్నారు. యాన్యువల్ మొబిలైజేషన్ పరేడ్ లో భాగంగా ఏఆర్ సిబ్బందికి వారు రోజువారి నిర్వహించే విధుల పట్ల, ఇతర అంశాలపై ట్రైనింగ్ ఇచ్చామన్నారు. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలని, ఆయుధాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏఆర్ సిబ్బందితో ఏర్పాటు చేసిన పోలీస్ కళాబృందాలు వేల మంది విద్యార్థులు, ప్రజలకు వివిధ సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించారన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, బ్లడ్ డొనేషన్, ప్లాస్మా డొనేషన్, ఆర్గన్ డొనేషన్ పై, ఎన్నికల సమయంలో ఓటు విలువ, ‘ఓటు హక్కు పై ప్రజలకు, యువతకు ఆట, పాటలతో అవగాహన కల్పించారన్నారు.

ఏడీసీపీ సీఎస్ డబ్ల్యూ హెడ్ క్వార్టర్స్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సైబరాబాద్ ఆర్మ్ డ్ రిజర్వ్ యాన్యువల్ మొబిలైజేషన్ లో లాఠీ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్, గార్డ్ మౌంటింగ్, మాబ్ ఆపరేషన్, పికెట్స్, బందోబస్త్ డ్యూటీస్, లా అండ్ ఆర్డర్ సమస్యలపైనా, Natural calamities, Explosives, Precautions from Land mines, Role of Sniffer dog and Demo, Prisoner Escorts, Exam paper escorts, VIP Escorts, Quick march- Slow March, Firing, Handling of suspicious articles, Mob operation and practice with tear gas and Anti Riot Gas, Granide stripping, assembly., Field Craft and Map reading, Case studies వంటి అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. బాంబ్ డిస్పోజల్ టీమ్ పనితీరును అభినందించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసిన శునకాల ప్రదర్శన ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ఏడీసీపీ క్రైమ్స్ I కవిత, ఏడీసీపీ అడ్మిన్ లావణ్య, ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మాణిక్ రాజ్, ఏసీపీలు సంతోష్ కుమార్, లక్ష్మి నారాయణ, 1635 ఏఆర్ సిబ్బంది, సీటీసీ డాక్టర్లు సుకుమార్, సరిత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here