ఘ‌నంగా విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక బోనాల ఉత్స‌వాలు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీశ్రీశ్రీ విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక బోనాల మహోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీ లోని శ్రీశ్రీశ్రీ విజయదుర్గా భవాని అమ్మవారి వార్షిక బోనాల మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఆయ‌న‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ వార్షిక బోనాల మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుణశేఖర్ , సురేష్, సత్య కుమార్, అశోక్, మురళి, బాలకృష్ణ, రజినీకాంత్ , శ్యామ్, రాజు, ఆనంద్, శివకుమార్ , మంజునాథ్, నరేష్ , ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here