చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠపాలిత షిరిడి సాయి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ షిర్డి సాయిబాబా ఆలయ 9వ వార్షికోత్సవ వేడుకలు రెండవరోజు వైభవంగా కొనసాగాయి. ఆదివారం ఉదయం ఉదయం నుంచి కాకడ హారతి, 108 లీటర్ల పాలతో క్షీరాభిషేం, చండీహోమం,అన్నసమారాధన, సాయి హోమాలు, సంధ్యహారతి, లక్ష పుష్పార్ఛన, శేజ హారతి, నీరాజన మంత్ర పుష్పం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ప్రముఖ నాట్యగురువు కల్వచర్ల విజయలక్ష్మి హరికుమార్ బృదం నృత్య ప్రాదర్శనతో ఆకట్టుకున్నారు.

క్షీరాభిషేకం సేవలో లీలారవిచంద్ర కుమార్ శిరీష దంపతులు, అన్నదాన సేవలో సత్యనారాయణ గౌడ్ అనురాధ దంపతులు, పుష్పార్ఛన సేవలో ప్రవీన్‌కుమార్ నిహారిక, నవీన్‌కుమార్, లక్ష్మీ సాయిదీపిక దంపతులు, అల్పాహార సేవలో వెంకట కామేశ్వర సుబ్రహ్మణ్యం, లలితాకుమారి దంపతులు భాగస్వామ్యమయ్యారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని అన్న ప్రసాదాలను స్వీకరించారు. సోమవారం ఉత్సవాలు ముగింపులో భాగంగా ముఖ్యంగా అష్టోత్తర శతకళశాభిషేకం, పూర్ణాహుతి, పండిత సత్కారం తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటి చైర్మన్ యవీ రమణ మూర్తి తెలిపారు.

