రంజిత్ రెడ్డి జ‌న్మ‌దిన వేళ‌ అనాధ చిన్నారుల‌కు పౌష్టికాహారం అంద‌జేసిన రామ్ క‌ట‌కం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చేవెళ్ల పార్ల‌మెంట్ స‌భ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఎంపీ రంజిత్ అన్న యువ‌సేన అధ్యక్షుడు రామ్‌క‌ట‌కం శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. టీఆర్ఎస్ నాయ‌కులు జంషేడ్ ర‌వి, అనిల్‌, ప్రేమ్‌, సుద‌ర్శ‌న్‌ల‌తో న‌గ‌రంలోని ఎంపీ నివాసంలో ఆయ‌న‌ను క‌ల‌సి ఘ‌నంగా స‌న్మానించి, కేక్ క‌ట్ చేసి అభినంద‌న‌లు తెలిపారు.

ఎంపి రంజిత్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న రామ్ క‌ట‌కం, అనిల్‌, ప్రేమ్‌, సుద‌ర్శ‌న్‌లు

అనంత‌రం న‌ల్ల‌గండ్లలోని శిశు మంగ‌ళ్ అనధాశ్ర‌మంలో చిన్నారుల‌కు మంచి పౌష్టికాహారాన్ని అంద‌జేశారు. వారితో క‌ల‌సి ఆశ్ర‌మ ప్రాంగ‌ణ‌లో మొక్క‌లు నాటారు. ఎంపి రంజిత్ రెడ్డి భ‌విష్య‌త్తులో మ‌రెన్నో ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాల‌ని, సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధిస్థున్న‌ట్టు రామ్ క‌ట‌కం తెలిపారు.

శిశు మంగ‌ళ్ అనధాశ్ర‌మంలో చిన్నారుల‌కు మంచి పౌష్టికాహారాన్ని అంద‌జేస్తున్న‌రామ్ క‌ట‌కం త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here