రూ.2.81 ల‌క్ష‌లు ప‌లికిన‌ మియాపూర్ యూత్ గ‌ణేశుడి ల‌డ్డు – వ‌రుస‌గా 4వ‌ ఏడాది ల‌డ్డు ద‌క్కించుకున్న కూన స‌త్యం గౌడ్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ యూత్ అసోసియేష‌న్ ఆద్వ‌ర్యంలో తొమ్మిది రోజులు పూజ‌లందుకున్న గ‌ణ‌నాథుడి ల‌డ్డూ రూ.2.81 ల‌క్ష‌ల ధ‌ర ప‌లికింది. ప్ర‌ముఖ ఎక్సైజ్ కాంట్రాక్ట‌ర్‌, టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు కూన స‌త్యం గౌడ్ కుటుంబ స‌భ్యులు ల‌డ్డూను కైవ‌సం చేసుకున్నారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా మియాపూర్ యూత్ వినాయ‌కుడి ల‌డ్డూను కూన స‌త్యం గౌడ్ ద‌క్కుంచుకుంటూ రావ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా యూత్ అసోసియేష‌న్‌ స‌భ్యులు, గ్రామ పెద్ద‌లు కూన సత్యం కుటుంబ స‌భ్యుల‌కు ల‌డ్డూను అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలియ జేశారు.

రూ.2.81 ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకున్న ల‌డ్డూను కూన స‌త్యం గౌడ్ కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేస్తున్న యూత్ అసోసియేష‌న్‌ స‌భ్యులు, గ్రామ పెద్ద‌లు

ల‌క్కీ డ్రాలో మ‌రో ల‌డ్డూను కైవ‌సం చేసుకున్న కూన సాయిబాబు గౌడ్‌
అదేవిధంగా 9 రోజులు పూజ‌లందుకున్న వినాయ‌కుడి మ‌రోల‌డ్డుకు ల‌క్కీ డ్రా నిర్వ‌హించ‌గా స్థానిక భ‌క్తుడు కూన సాయిబాబు గౌడ్‌ను అదృష్టం వరించింది. వంద‌లాది మంది పాల్గొన్న ల‌క్కీ డ్రాలో త‌న కూప‌న్ నెంబ‌ర్‌పై ల‌డ్డు రావ‌డం ప‌ట్ల‌ సాయిబాబు గౌడ్ కుటుంబ స‌భ్యులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. భ‌గ‌వంతుడి అనుగ్ర‌హంగా బావిస్తున్న‌ట్టు వారు తెలిపారు.

ల‌క్కీ డ్రాలో కైవ‌సం చేసుకున్న ల‌డ్డూతో కూన సాయిబాబు గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here