శేరిలింగంపల్లి, నవంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఉద్యమం కార్యవర్గ కార్యచరణ కార్యవర్గం కూర్పు 2026- 2027 నియామకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా శేరిలింగంపల్లి గోపినగర్ నివాసి సిరిపురం హరికృష్ణ చారిని నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ నియామక పత్రం అందజేశారు. బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు, మండల, గ్రామకమిటీలు ఏర్పాటు చేసి మంచి వ్యక్తులను, బిసి ఉద్యమాన్ని నడిపించి అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేసే వాళ్లను నియమించడం జరుగుతుందని భేరి రామచంద్ర యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు. శ్రీ హరికృష్ణ చారి పదవి రెండు సంవత్సరాల పాటు ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక చేపట్టే కార్యక్రమాలు, ఉద్యమ పోరాటంలో భాగంగా అందరితో కలిసి పని చేయాలని సూచించారు. అధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటపటిమని చాటాలని సూచించారు. పేదలకు విద్యా వైద్యం ఉపాధి విషయంలో సహాయపడాలని అన్నారు. ఈ సందర్భంగా కార్య నిర్వాహణపై కార్యవర్గం ప్రణాళిక ప్రకారం 2026, 2027 కు గాను నియమించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, భటరాజు సంఘం బంటు రాజు పాల్గొన్నారు.






