శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా యువ మోర్చా (BJYM) చందానగర్ డివిజన్ అధ్యక్షుడిగా ఆకుల సందీప్ కుమార్ నియామకమయ్యారు. బీజేపీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు సందీప్ కుమార్‌కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని, అంకిత భావంతో విధులు నిర్వహిస్తానని తెలిపారు.






