షేక్ పేట్ డివిజన్ లో బీజేపీ నాయ‌కుల ఇంటింటి ప్ర‌చారం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా షేక్ పేట్ డివిజన్ కు సంబంధించిన పోలింగ్ బూతులలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో భాగంగా షేక్ పేట్ డివిజన్ అధ్యక్షుడు పూస రాకేష్ ఆధ్వర్యంలో సీతానగర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే లంకల దీపక్ రెడ్డితో క‌లిసి శేరిలింగంప‌ల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ర‌వికుమార్ యాద‌వ్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీనివాసరెడ్డి , మాజీ కార్పొరేటర్ ప్రకాష్ , కౌన్సిల్ మెంబర్ శివ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here