శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 11 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 7 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇంజినీరింగ్ విభాగానికి 3 ఫిర్యాదులు అందగా, ఇరిగేషన్ విభాగానికి 1 ఫిర్యాదు వచ్చింది. అన్ని విభాగాలకు కలిపి మొత్తం 11 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీ శశిరేఖ పాల్గొన్నారు.






