అక్ర‌మ నిర్మాణంపై పోలీసుల‌కు శేరిలింగంప‌ల్లి డీసీ ఫిర్యాదు… హ‌ర్షం వ్య‌క్తం చేసిన జ‌నంకోసం…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జ‌న‌కోసం ఫిర్యాదు చేసిన అక్ర‌మ నిర్మాణంపై శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ ఉప‌క‌మిష‌న‌ర్ తేజావ‌త్ వెంక‌న్న చందాన‌గ‌ర్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం ప‌ట్ల సంస్థ‌ అధ్య‌క్షుడు క‌సిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అధికార పార్టీ నాయ‌కులు అక్ర‌మ నిర్మాణాలు చేప‌డుతూ.. ప్ర‌శ్నించిన వారిపై దుష్ప్ర‌చారాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అబ‌ద్ధ‌పు పునాదుల మీద ఆరోప‌ణ‌లు మాని అక్ర‌మ నిర్మాణాల‌కు దూరంగా ఉండాల‌ని వారికి హిత‌వు ప‌లికారు. ఆల‌స్యంగా ఐనా స్పందించిన జీహెచ్ఎంసీ అధికారుల‌కు ఆయ‌న ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పోలీసులు ఫిర్యాదుపై జాప్యం చెయ్య‌కుండా, భాద్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌సిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి కోరారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here