నమస్తే శేరిలింగంపల్లి: శ్రావణ మాసం పౌర్ణమి సందర్భంగా ఆదివారం చందానగర్ లోని శ్రీ విశాఖ శారద పీఠాధిపతి పాలిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో అఖండ లక్ష్మీ సహస్ర నామ స్తోత్ర పారాయణం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం సత్యసాయి పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు మహిళలు అఖండ లక్ష్మీ సహస్ర నామ స్తోత్ర పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.