నమస్తే శేరిలింగంపల్లి: రాఖీ పర్వదినం సందర్భంగా బ్రహ్మకుమారిస్ మహిళ సోదరీమణులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ ని వారి నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారిస్ మహిళ సోదరీమణులకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆత్మీయ అడపడచులందరికి రాఖీపర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పర్వదినం చాలా పవిత్రమైనది అని అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.