శేరిలింగంపల్లి, ఆగస్టు 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని స్ప్రింగ్ వ్యాలీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అభియన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ మ్యూజిక్ స్కూల్ ను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ విశిష్ట అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా అభియన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ మ్యూజిక్ యాజమాన్యం జరీన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. మరిన్ని శాఖలుగా విస్తరించి, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.






