నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

శేరిలింగంప‌ల్లి, మే 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జనగణన , కులగణనతో వెనుకబడిన అన్ని వర్గాల వారికి న్యాయం జ‌రుగుతుంద‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. జనగణన దేశ అభివృద్ధికి మార్గదర్శిని అని, కులగణన ఆ అభివృద్ధిలో సమానతను తీసుకువచ్చే సాధనం అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జనగణనతో పాటు కులగణన చేయాలని తలపెట్టిన చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ మసీద్ బండ పార్టీ కార్యాలయం వద్ద నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ర‌వికుమార్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, శేరిలింగంపల్లి 106 డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, మాదాపూర్ డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్‌ రాధా కృష్ణ యాదవ్, సోమయ్య యాదవ్, శ్రీనివాస్, అరవింద్, రాజేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here