శేరిలింగంపల్లి, మే 4 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్యవైశ్య సంఘం మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాశెట్టి ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో వాసవి మాత పూజ, గోపూజ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గోశాల వద్ద రామకృష్ణ నగర్ ఆర్యవైశ్య సంఘం ప్రభాకర్ గుప్తా, రామకృష్ణ నగర్ కాలనీ అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గోపూజ గరుకు స్థంభం ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. గోవులకు మేత సరఫరా కార్యక్రమంలో పాల్గొని బేరి రామచంద్ర యాదవ్ గోవులకు మేతను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రామకృష్ణ నగర్ అధ్యక్షుడు దూదిపర్తి నాగమల్లేశ్వరరావు, వైశ్య సంఘం జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ ప్రభాకర్ గుప్తా, యూత్ అధ్యక్షుడు కుమార్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, ఆర్గనైజ్ సెక్రెటరీ శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు పృథ్వీ గుప్తా, దిష్టి కార్గిని సెక్రెటరీ మాసిట్టి ప్రభాకర్ గుప్తా, సిల్వర్ రేఖ, ఆంజనేయ, బాదం సాయిబాబా, వెంకట గురు ప్రసాద్ కె వి, కొత్త రాజు రఘురాం, నూకల సుబ్రమణ్యం, నాగేశ్వరరావు, శివ కుర్తి రాజు పాల్గొన్నారు.