శేరిలింగంపల్లి, జనవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర స్థాయి అండర్ 14 క్రికెట్ పోటీలకు గాను నిర్వహించిన ప్రాబబుల్స్ తొలి మ్యాచ్‌లో శేరిలింగంపల్లిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంకు చెందిన విద్యార్థి సీవీ చేతన్ ఆదిత్య సత్తా చాటాడు. మొత్తం 107 బంతులు ఆడిన ఆదిత్య 9 ఫోర్లతో 84 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కాగా ఆదిత్య ఇటీవలే రాష్ట్ర స్థాయి అండర్ 14 క్రికెట్ పోటీలకు ప్రాబబుల్స్ జట్టులో స్థానం సంపాదించాడు. ఈ క్రమంలోనే ప్రాబబుల్స్‌కు నిర్వహించిన తొలి మ్యాచ్ లో ఆదిత్య రాణించడం విశేషం. ఈ సందర్భంగా తుది జట్టులోనూ ఎంపికవుతానని అతను ధీమా వ్యక్తం చేశాడు. కాగా అతని కోచ్ రవి అతనికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆదిత్య ఇలాంటి మరెన్నో టోర్నీలకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.






