హైటెక్స్‌లో ACE TECH 2026 EXPO

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్స్ లో నిర్వహించిన ACE TECH 2026 EXPO కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ACETECH హైదరాబాద్ 2026 ఆసియాలో ప్రముఖ ఆర్కిటెక్చర్, డిజైన్, నిర్మాణ సామగ్రి ఎక్స్‌పో  జనవరి 23 నుడి 25 వ తేదీ వరకు  హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించే ACE TECH హైదరాబాద్ 2026 EXPO కార్యక్రమం లో నిర్మాణం, ఇంటీరియర్స్, ఇంజనీరింగ్‌లో ఆవిష్కరణలు ప్రదర్శించబడతాయి.  ఆర్కిటెక్చర్, నిర్మాణం, ఇంజనీరింగ్, నిర్మాణ సామగ్రి , ఇంటీరియర్స్ ఉత్పత్తి ప్రారంభాలు, అత్యాధునిక సాంకేతికతలు, పరిశ్రమ నాయకులతో నెట్‌వర్కింగ్, జ్ఞాన-భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here