మాదాపూర్‌లో ఘనంగా దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ‌ జయంతి వేడుక‌లు – మొక్క‌లు నాటిన ర‌వికుమార్ యాద‌వ్‌, రాధ‌కృష్ణ యాద‌వ్‌లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భారతీయ జనతా పార్టీ సేవా సమర్పణ అభియాన్‌లో భాగంగా మాదాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు మధుయాదవ్ ఆధ్వర్యంలో పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ముఖ్య అతిథిలుగా పాల్గొన్న‌ బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, మాదాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్‌లు పండిత్ దీన్దయాళ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంత‌రం స్థానికంగా మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ భూమి మన ఇల్లు లాంటిదని, దానిని శుభ్రంగా, ప‌చ్చ‌దనంతో కాపాడుకోవాల‌ని అన్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వ‌ల్ల నేటితో పాటు బావిత‌రాల‌కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకుర్చిన వార‌మ‌వుతామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయ‌కులు హరికృష్ణ, శ్రీశైలం కురుమ, శ్రీనివాస్ రెడ్డి, మదనాచారి, యాదయ్య, గోవర్ధన్ రెడ్డి, విజయ్, ఆనంద్, భాస్కర్ యాదవ్, నరేష్ రెడ్డి, శివ యాదవ్, విజయ్, రాజు యాదవ్, హరిప్రియ, రమాదేవి, లక్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.

మొక్క‌లు నాటిన ర‌వికుమార్ యాద‌వ్‌, రాధ‌కృష్ణ యాద‌వ్‌ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here