మియాపూర్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరూ దేశ భక్తిని చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ నాయకులు ఇలియాస్ షరీప్ అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఆజాదీ కా గౌరవ్ యాత్రలో భాగంగా మహమ్మద్ ఇలియాస్ షరీఫ్ అధ్వర్యం లో మియాపూర్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ౩౦౦ మీటర్స్ జాతీయ పతాకంతో సుమారు 10 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. దేశానికి స్వాతంత్ర్యం ‌సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కానున్న దృష్ట్యా ఏఐసీసీ, టీపీసీసీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.సత్యనారాయణరావు, తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్. కృష్ణ, మహిళా కాంగ్రెస్ బి. ఇంద్ర, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎన్ ఎస్ యూ ఐ శేరిలింగంపల్లి అధ్యక్షుడు సమీర్ షరీఫ్, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ అఫ్రోజ్ ఆలం ఖాన్, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎన్. రమేష్, ఆసిఫ్ పటేల్, మహమ్మద్ షరీఫ్, సురేష్, జమీర్ భాయ్, మొహ్సిన్, షారుక్, సల్మాన్, ఖుర్షీద్, జి. శేఖర్, విజయ్, చంద్రశేఖర్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here