శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంకు చెందిన విద్యార్థి రాష్ట్ర స్థాయి అండర్ 14 క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. పీజేఆర్ స్టేడియంలో కోచ్ రవి ఆధ్వర్యంలో క్రికెట్లో శిక్షణ పొందుతున్న సీవీ చేతన్ ఆదిత్య ఈ పోటీలకు ఎంపికై సత్తా చాటాడు. త్వరలో జరగనున్న అండర్ 14 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో చేతన్ ఆదిత్య పాల్గొననున్నాడు. ఈ క్రమంలోనే టోర్నీకి సంబంధించి హెచ్ టీమ్‌కు ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో ఆదిత్య చోటు సాధించాడు. ఈ సందర్భంగా అతని కోచ్ రవి అతనికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆదిత్య ఇలాంటి మరెన్నో టోర్నీలకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ఆడాలని కోరుకుంటున్నానని అన్నారు.






