శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్‌నగర్ కాలనీలో ఉన్న శివాలయం, చంద్రనాయక్ తండాలోని శివాలయం, మాతృశ్రీ నగర్ టెంపుల్ పార్కులోని శివాలయంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడు గంగల రాధాకృష్ణ యాదవ్ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొట్టమొదటిదైన గుజరాత్ సోమ్ నాథ్ పై దాడి జరిగి 1000 సంవత్సరాలు అవుతుందన్నారు. వెయ్యేళ్లుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ మహిమాన్విత క్షేత్రం భారత ఆధ్యాత్మికత, నాగరికత, వారసత్వ వైభవోపేతానికి సజీవ సాక్షిగా నిలబడిందన్నారు. ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగి ఈ ఏడాది 75 సంవత్సరాలు అవుతుందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి Narendra Modi ఈ ఏడాదిని సోమనాథ్ స్వాభిమాన పర్వంగా ప్రకటించారని అన్నారు.

ఈ కార్యక్రమాలలో డివిజన్ అధ్యక్షుడు గోలి వేణు గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మహేందర్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ సుమన్ నాయక్, ఎస్‌టీ మోర్చా అధ్యక్షుడు శీను నాయక్, సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి కుర్మయ్య, మహిళా నాయకులు భారతి, బాలమ్మ, నాయకులు కిరణ్ రెడ్డి, విజయ్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, నరేష్ రెడ్డి, రంజిత్, అల్లాడి ప్రవీణ్, మల్లారెడ్డి పాల్గొన్నారు.






