శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ 48లో SWG కార్మికుల హాజరు, SAT హాజరు, GVPల తొలగింపు, స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యకలాపాలపై డిప్యూటీ EE SWM, AE SWM, SS, SRP, SFAలతో వారంవారీ మంగళవారం పారిశుధ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. GHMC మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ అధ్యక్షతన పారిశుధ్య విభాగం సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని రోడ్లు, కాలనీలు ఎప్పటికపుడు శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలని, కాలనీల లో పారిశుధ్య పనులు చేయాలని, చెత్తను ఎవరూ బయట వేయకుండా, రోజూ ఆటోకు అందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

సర్కిల్ లోని అన్నపూర్ణ క్యాంటీన్ ల పరిసరాలు శుభ్రంగా వుండేట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. చెత్త ఆటోలు ఎప్పటికప్పుడు చెత్తను ఇండ్ల నుండి, వాణిజ్య సముదాయాల నుండి తీసుకువెళుతున్నారా, లేదా రోజూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి షాప్ , అపార్ట్మెంట్ లు, స్ట్రీట్ వెండార్స్, కార్యాలయాలు, ప్రార్టనా మందిరాలు మొదలైన వారు తప్పనిసరిగా రెండు డస్ట్ బిన్ లు పెట్టుకునే విధంగా చూసుకోవాలని, ఆటోకు చెత్తను అందించే విధంగా చూడాలని, చెత్తను రోడ్ల పైన వేసే వారిని గుర్తించి GHMC అప్ ద్వారా పెనాల్టీ చలాన్ లు వేసి కట్టడి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశం లో సర్కిల్ పారిశుధ్య అధికారి వశీధర్ DE, ఏఈ నిఖిల్, ఎస్ఎస్ శ్రీనివాస్, జవాన్ లు, Srp లు, Sfa లు, రాంకీ సిబ్బంది పాల్గొన్నారు.





