శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి హిల్స్ కమ్యూనిటీ లోని ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద మొదలవుతున్న సీవరేజి లైన్ పనులకు జలమండలి, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలసి రోడ్ ఇన్స్పెక్షన్ లో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, హెచ్ఎంటి హిల్స్ కమ్యూనిటీ లోని ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు వద్ద మొదలవుతున్న సీవరేజి లైన్ పనుల కొరకు అధికారులతో కలసి పరిశీలించి తగిన సూచనలు చేశామని, పనులను తక్షణమే మొదలుపెట్టాలని అధికారులకు చెప్పడం జరిగిందని, ప్రతి చిన్న సమస్య గురించి చర్చించి, వెంటనే సమస్యలు పరిష్కారం జరిగేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డీఈ మౌనిక, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






