యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చ‌లివేంద్రం ప్రారంభం

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 25 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మండుతున్న వేసవి వేడిలో ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మియాపూర్‌లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. గత రెండు సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది మరింత విస్తృతంగా మియాపూర్ మెయిన్ రోడ్‌లోని హేమదుర్గా మాత ఆలయం సమీపంలో ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత తాగునీరు, చల్లని మజ్జిగను అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, నల్ల సంజీవ్ రెడ్డి హాజరై చ‌లివేంద్రాన్ని ప్రారంభించారు.

అదే సందర్భంలో చలివేంద్రం ప్రాంగణంలో శుభకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్, బిగ్ టీవీ సహకారంతో ఫ్రీ మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపులో మియాపూర్ డివిజన్‌కు చెందిన అనేక మంది ప్రజలు పాల్గొని వివిధ ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఉచితంగా మందులు పొందారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. త‌మ‌ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వీరేంద్ర గౌడ్, మన్నేపల్లి సాంబశివరావు, ప్రభాకర్ రెడ్డి, మహేందర్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, విజయ్ ముదిరాజ్, కట్ల శేఖర్ రెడ్డి, మిరియాల ప్రీతం, అయాజ్ ఖాన్, యాదగిరి గౌడ్, గంగాధర్, డీఎస్ఆర్కే ప్రసాద్, అట్టేపల్లి రాంప్రభు, వెంకటేశ్వర రావు, బాబ్జీ, వల్లభనేని సత్యనారాయణ, నరేంద్ర మన్నె, బండి రామకృష్ణ, శంకర్, దినేష్ గౌడ్, రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here