మియాపూర్ స‌ర్కిల్ కార్యాల‌యానికి 7 ప్ర‌జావాణి ఫిర్యాదులు

శేరిలింగంప‌ల్లి, మే 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాల‌యంలో సోమ‌వారం ప్ర‌జావాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా డిప్యూటీ కమిష‌న‌ర్ శ‌శిరేఖ ఈ కార్య‌క్ర‌మంలో స్వ‌యంగా పాల్గొని ప‌లు ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌ను స్వీక‌రించారు. రెవెన్యూ వింగ్‌కు 1 ఫిర్యాదు రాగా, ఇంజినీరింగ్ విభాగానికి 5, యూబీడీకి 1 మొత్తం క‌లిపి 7 ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఆయా ఫిర్యాదుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా డీసీ సంబంధిత అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here