శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలు పరిస్థితి, వివిధ వర్గాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిరాశకు గురిచేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు, అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హఫీజ్‌పేట్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మల రామకృష్ణ గౌడ్, చిర్ర రవీందర్ యాదవ్, మిద్దెల మల్లారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, గంగారం సంగారెడ్డి, షేక్ జమీర్, జనార్దన్ గౌడ్, బాబు మోహన్, మల్లేష్ సాబెర్, గణేష్ రెడ్డి, రాజు యాదవ్, బీఆర్ఎస్వీ యమాలవలస రాజు, సునీల్ రెడ్డి, సందీప్ రెడ్డి, మజీద్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






