అన్నదాతల కోసం కేటీఆర్ సారథ్యంలో అలుపెరగని పోరాటం తప్పదు – శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం‌ కొనేంత‌ వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిరసనలు‌ చేపట్టడం‌ జరుగుతుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్ తెలిపారు. రైతుల వడ్లు కొనుగోలు చేయాలంటూ మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం శేరిలింగంపల్లి డివిజన్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం అయిదు అంచెల యాక్షన్ ప్లాన్ లో యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వీరేశం గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు మిరియాల రాఘవ రావు, భేరి రామచందర్ యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, వార్డు మెంబర్ శ్రీకళ, వెంకటేశ్వర్లు, రవి, రాజలింగం, శివాజీ, యాదగిరి, సాయి, మైసమ్మ, రాజమ్మ, నాగరాజు, పటోళ్ల నర్సింహ, బస్వరాజ్, రవీంద్ర రాథోడ్, రజని, తలారి విజయ్, గోపాల్ యాదవ్, రవి యాదవ్, రాజు, రామచందర్, జమ్మయ్య, శ్రీకాంత్, సత్తార్, అలీ, సాయి, శ్యామ్, దివాకర్ రెడ్డి, సబియా, సౌజన్య, భాగ్యలక్ష్మి, జయ, మరియు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, బస్తీ కమిటీ ప్రెసిడెంట్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వరి ధాన్యం‌ కొనుగోలు చేయాలని నిరసన తెలుపుతున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here