రూ. 70 లక్షలతో పాపిరెడ్డి కాలనీలో యూజీడీ పనులు – శంకుస్థాపన చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి డివిజన్ ను అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో రూ. 70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న యూజీడీ పైపులైన్ పనులకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పూర్తి అవగాహనతో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా తీసుకున్న చర్యలతో నేడు స్వచ్ఛ కాలనీలు, బస్తీలుగా మారడంతో గతంలో కంటే సీజనల్ వ్యాధులు తగ్గాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ఆర్ జీ కే వార్డు మెంబర్ శ్రీకళ, నాయకులు వేంకటేశ్వర్లు, రవి, రాజలింగం, శివాజీ, యాదగిరి, సాయి, మైసమ్మ, రాజమ్మ, నాగరాజు, పటోళ్ల నర్సింహ, బస్వరాజ్, రవీంద్ర రాథోడ్, రజని, తలారి విజయ్, గోపాల్ యాదవ్, రవి యాదవ్, రాజు, రామచందర్, జమ్మయ్య, శ్రీకాంత్, సత్తార్, అలీ, సాయి, దివాకర్ రెడ్డి, సబియా, సౌజన్య, భాగ్యలక్ష్మి, జయ, వాటర్ వర్క్స్ మేనేజర్ యాదగిరి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

పాపిరెడ్డి కాలనీలో యూజీడీ పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here