తెలంగాణ రైతుల ఉసురు తప్పదు – మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వాల విధానాలు పూర్తిగా అన్నదాతలకు వ్యతిరేకంగా ఉన్నాయని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం ఉసురు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సూచన ప్రకారం హాఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని అల్విన్ కాలనీ కాలనీ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా తెలంగాణ రైతాంగ పక్షాన ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి రైతుల పక్షాన నిలబడిన మహా నేత కేసీఆర్ అని, వడ్ల కొనుగోలుకు కేంద్రంపై రైతన్నలు నాగళ్లు ఎత్తడానికి సిద్ధపడ్డారని అన్నారు. పండించిన వరిధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనేంతవరకు ఉద్యమిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, హాఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ సాంబశివరావు, మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ సాదిక్ హుస్సేన్, వార్డు సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్, నాయకులు అనిల్ కావూరి, శ్రీనివాస్, ఖాసీం, శ్యామ్, ప్రభు, సుధాకర్, లక్ష్మణ్, రవి, సంజు సాగర్, ముక్తర్, తైలి కృష్ణ, కేశవులు, రామకృష్ణ, యాదగిరి, రంగస్వామి, అంకా రావు, ముజీబ్, పాషా, శ్రీనివాస్ నాయక్, మహిళలు షేబాన, పద్మ, కరీనా బేగం, రుకసనా బేగం, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అల్విన్ చౌరస్తాలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తున్న మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here