నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ శుభకృత్ నామ తెలుగు నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు కలిసి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అదేవిధంగా షడ్రుచుల సమ్మేళనం సంబరాల సూర్యోదయం భవితల పంచాంగ శ్రవణం వసంత కోయిల గానంతో పాటు వచ్చేదే తెలుగు పండగ ఉగాది అన్నారు.ఈ నూతన తెలుగు సంవత్సరంలో కొత్త ఆశలు, ఆశయాలు, ఆలోచనలతో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, కోనేరు ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, గుమ్మడి శ్రీనివాస్, అనిల్ కావూరి, కార్తీక్ రావు, రఘునాథ్, భిక్షపతి ముదిరాజ్, ఖాసీం, మున్నా, దుర్గేష్ తదితరులు ఉన్నారు.