నమస్తే శేరిలింగంపల్లి: పని కోసం ఇంటి నుంచి బయటకెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కి చెందిన ఏడాకుల నాగేశ్వర్ రావు మణికొండ లో నివాసం ఉంటున్నారు. కూతురు భవాని ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మార్చి 26వ తేదీన పని కోసం ఇంటి నుంచి బయటకెళ్లిన భవాని ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువుల ఇళ్లల్లో, చుట్టు పక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఏడాకుల నాగేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.