సామాజిక సేవలో ఆర్యవైశ్యులం ముందుంటాం – టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త

నమస్తే శేరిలింగంపల్లి: సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తున్నారని టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చందానగర్ డివిజన్ నూతన కార్యాలయాన్ని, శ్రీ శుభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర పంచాంగాన్ని ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చందానగర్ డివిజన్ ఆధ్వర్యంలో శ్రీ శుభకృత్ నామ సంవత్సర పంచాంగము 2022-2023 ఆవిష్కరించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణ పండుగల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గౌరవం దక్కిందన్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులకు నాలుగు రాష్ట్ర కార్పొరేషన్ పదవులు, 11 మున్సిపల్ చైర్మన్ పదవులు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒకరికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా అవకాశం కల్పించారని అన్నారు.

చందానగర్ లో ఆర్య వైశ్య ఫెడరేషన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివాస్ 

ఆర్యవైశ్య పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఆర్యవైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదని, సామాజిక సేవలోను ముందుంటారని అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేది ఒక్క ఆర్యవైశ్యులు మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ చందానగర్ అధ్యక్షుడు, పీఆర్కే చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ పోలా కోటేశ్వరరావు, ఐవీఎఫ్ వైస్ చైర్ పర్సన్ పోలా వాణి, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా, జనరల్ సెక్రటరీ ముస్త్యాల శ్రీనివాస్, కోశాధికారి గౌరి శంకర్, సనత్ నగర్ అధ్యక్షుడు శ్రీకాంత్ గుప్త, శేరిలింగంపల్లి డివిజన్ ప్రెసిడెంట్ ఆదిచిన్నం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, కోశాధికారి మారం నాగ శివ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ భవానీ ప్రసాద్, మారం నాగరాజ్ గుప్తా, మునిగల సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కటకం కిరణ్, సత్యనారాయణ, శోభారాణి, శ్రీకాంత్, ఆంజనేయులు, వినయ్ కుమార్, భాస్కర్, బాలయ్య, ఆర్యవైశ్య నాయకులు, ఐవీఎఫ్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here