నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ మెయిన్ రోడ్డులో అధికారులు, డివిజన్ నాయకులు, బస్తీ సభ్యులతో కలిసి స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ బస్తీ, కాలనీలలో నెలకొన్న మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గత వారం రోజులుగా పొంగిపొర్లుతున్నా డ్రైనేజ సమస్యను పరిశీలించి, త్వరగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ గౌడ్,సయ్యద్ గౌస్, సహదేవ్, గౌస్ పటేల్, గోపాల్ నాయక్, యూత్ సభ్యులు జైపాల్, వెంకటేష్, ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ మేనేజర్ ఇల్వర్తి, వర్క్ ఇన్ స్పెక్టర్లు చారి, శర్మ, బాలు తదితరులు పాల్గొన్నారు.
