నమస్తే శేరిలింగంపల్లి: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత అలవడుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని కావూరి హిల్స్ లోని శివసాయి దుర్గా దివ్యక్షేత్రం లో ఘనంగా మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే గాంధీ, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న దేవాలయం ప్రాంగణం లో జరిగిన మల్లన్న స్వామి వారి కల్యాణం, మల్లన్న కేతమ్మ ఒగ్గు కథ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు బొద్దం కిట్టు యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఐలేష్ యాదవ్, శ్రవణ్ యాదవ్, రాజు యాదవ్, గంగారాం యాదవ్, ఆగం యాదవ్, రాజేష్ యాదవ్, మనీష్,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.