నమస్తే శేరిలింగంపల్లి: దక్షిణభారతదేశంలో మొదటిసారిగా అంతర్జాయతీయ ప్రమాణాలతో అత్యాధునిక డయాగ్నోస్టిక్స్ సేవలను అందజేస్తున్న స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ నిర్వాహకులను జిల్లా రిటైర్డ్ జడ్జి, హెచ్ వై ఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ అడ్వయిజరీ సలహాదారుడు సుందర్ రామయ్య అభినందించారు. డయాగ్నోస్టిక్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే సేవల్లో నాణ్యతా ప్రమాణాలతో సేవలందించడం పట్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్ ఆర్గనైజషన్ (ఐఎస్ఓ) సర్టిఫికేట్ ను స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ సీఈఓ వెంకటేష్ కు హెచ్ వై ఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ అడ్వయిజరీ సలహాదారుడు సుందర్ రామయ్య చేతుల మీదుగా అందజేశారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఎల్‌బి నగర్, ఏఎస్ రావు నగర్,జేఎన్‌టీయూ ఐదు ప్రాంతాలల్లో అత్యాధునిక డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తక్కువ కాలంలో నాణ్యమైన సేవలతో మంచి గుర్తింపు పొందడం సంతోషకరమని చెప్పారు. స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ సీఈఓ వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశంలో ఒకేసారి ఒకే సమయంలో ఒకే నగరంలో ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లతో ఐదు ప్రదేశాల్లో ఒకేసారి ప్రాంభించుకోవడం గర్వకారణమని అన్నారు. సేవలను గుర్తించి మాకు ఐఎస్ఓ సర్టిఫికెట్ అందించినందుకు ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జితేందర్ రెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.