నమస్తే శేరిలింగంపల్లి: కులమతాలకు అతీతంగా గ్యార్మీ ఉత్సవాలను జరుపుకోవడం సంతోషకరం అని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి లో నిర్వహించిన గ్యార్మీ ఉత్సవాలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. హిందూముస్లింలు ఐక్యంగా ఉంటూ జరుపుకునేది గ్యార్మీ పండుగ అన్నారు. ప్రతి సంవత్సరం ముస్లిం మాసాల ప్రకారం రబ్బీసాని మాసంలో గచ్చిబౌలి గ్రామంలో మైసుభాని దర్గ వద్ద గ్యార్మీ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. అనంతరం దర్గా వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి మైనారిటీ అధ్యక్షుడు నాయీమ్, గడ్డరాజు, నందుసింగ్, మహమూద్ భాయ్, అజ్జుబాయ్, టింకు, విఠలాచారి, అబ్దుల్ సత్తార్, ముకేశ్ సింగ్, సదానంద్, సలీం, అబ్దుల్ రహీం, రవి కిరణ్, రంజిత్ సాగర్, సాయి, జమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.