నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరణ పనులను చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ లో నాయనమ్మ కుంట చెరువు అభివృద్ధి కోసం కోటి 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ, సంరక్షణ పనులకు స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ శంకుస్థాపన చేశారు. చెరువు సుందరీకరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్ట పరిచేలా పునరుద్ధరణ , చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్ (కంచె) ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలుగు నిర్మాణం, చెరువు సుందరీకరణ పనులను త్వరగా పూర్తిచేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మక్త మహబూబ్ పేట్ చెరువును పరిశీలించి చెరువు అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ శాఖ ఈఈ నారాయణ, డీఈ నళిని, డీఈ శేషగిరి, ఏఈ పావని, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు పురుషోత్తం యాదవ్, అన్వర్ షరీఫ్, బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, గంగాధర్ రావు, మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, గోపారాజు శ్రీనివాస్, మాధవరం గోపాల్, మహమ్మద్ ఖాజా, వరలక్ష్మి, ఉమ, స్వరూప, రాజేష్ గౌడ్, నర్సింగ్, సూర్య దేవర శ్రీనివాస్ రావు, నర్సింగ్ రావు, స్వామి నాయక్, సుధాకర్, కమలాకర్, జంగం మల్లేష్, వెంకటేశ్వర్లు, బాబ్జి, రాజు గౌడ్, శివ, యూ రాజు, నర్సింలు గౌడ్, పి రాజు, బాలు చౌదరి, రమణ, శ్రీనివాస్, నరేందర్, శ్రీనివాస్ గౌడ్, రాణి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






